![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -437 లో.....రామరాజు ఇంట్లో ప్రేమ, ధీరజ్ కలిసి శ్రీరామనవని సందర్బంగా చేస్తున్న పూజలో కూర్చుంటారు. ఆ తర్వాత అందరు ప్రసాదం తింటూ సరదాగా మాట్లాడుకుంటారు. అల్లుడు గారు మాతో పాటు ఒక వారం రోజులు వేదవతి పంపండి అని రామరాజుని వేదవతి వాళ్ళ అమ్మ అడుగుతుంది. లేదు అమ్మ ఇల్లు పిల్లల్ని వదిలేసి రాలేనని వేదవతి అంటుంది. నువ్వు అలా అంటావనే అల్లుడు గారిని అడుగుతున్నానని వేదవతి వాళ్ళ అమ్మ అంటుంది.
పోండి అత్తయ్య మంచిగా ఎంజాయ్ చేసి రండి అని ప్రేమ, నర్మద అంటారు. ఇక అందరు వెళ్ళమంటారు.. రామరాజు కూడా సరే అనడంతో వేదవతి సరే అంటుంది. ఆ తర్వాత ప్రేమ, నర్మదలతో మాట్లాడాలని శ్రీవల్లి పిలుస్తుంది. జరిగిందేదో జరిగింది.. వదిలెయ్యండి చెల్లెళ్లు అని వాళ్ళిద్దరిని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. చూసావా ఈ వల్లి తప్పు అని ఒప్పుకోవడం లేదని ప్రేమ అంటుంది. ప్లీజ్ ఇద్దరు కలిసి నా కాపురం ఇలా చేశారు.. మీరే నన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. నిన్ను నమ్మితే మా పని అంతే అని నర్మద అంటుంది.
ప్లీజ్ చెలెళ్లు అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. అది చూసి భాగ్యం వచ్చి ఏంటే నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావని కోప్పడుతుంది. నీకేం తెలియదు అమ్మ సైలెంట్ గా ఉండమని శ్రీవల్లి అంటుంది. నువ్వు అసలు తల్లివేనా తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని నర్మద అంటుంది. పది రోజుల్లో నా కూతురు ఆ ఇంట్లో ఉండేలా చేస్తాను. నువ్వు వాళ్ళని బ్రతిమిలాడడం ఏంటే అని శ్రీవల్లిని భాగ్యం లాక్కొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |